నెల్లూరులో ర్యాగింగ్ రక్కసి మరో నిండు ప్రాణం బలితీసుకుంది. కాలేజీల్లో ర్యాగింగ్ నివారణకు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌లు పెడుతున్నా.. ఈ భూతాన్ని కంట్రోల్ చేయలేకున్నారు. తాజాగా నెల్లూరులోని ఓ మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్థి లైంగిక వేధింపుల కారణంగా ఓ బీడీఎస్ స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రదీప్ అనే యువకుడు కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ప్రదీప్ మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.