Andhra Pradesh Assembly Budget Session Start Today: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. అయితే ఈ నెల 28న అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేశారు.. వైఎస్సార్‌సీపీ సభ్యులు సభకు హాజరుకానున్నారు.