Andhra Pradesh Assembly Monsoon Session Begins Today: ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలిరోజు ప్రశ్నోత్తరాలు నిర్వహించి.. అనంతరం బీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. నేడు డీఎస్సీపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేయనున్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. ముఖ్యమైన బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నారు. నాలుగు రోజుల పాటూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు.. బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.