తెలంగాణలో లేఅవుట్ల క్రమబద్దీకరణ ప్రక్రియ నేటి (ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమోదించిన దరఖాస్తులకు.. మంగళవారం నుంచే ఫీజులు చెల్లించి.. క్రమబద్ధీకరించుకునేలా ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే.. ఎల్‌ఆర్ఎస్‌కు సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలు ఈరోజో, రేపో విడుదలయ్యే అవకాశం ఉంది.