నేతన్న సేవలో పథకం లబ్ధి అందని వారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఈ పథకం ప్రయోజనాలు అందని అర్హులక, వారం రోజుల్లోగా ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి సవిత ప్రకటించారు. దరఖాస్తుదారులలోని అర్హులను గుర్తించి.. రూ.25 వేలు అందిస్తామని స్పష్టం చేశారు. నేతన్న సేవలో పథకం అమలుపై సచివాలయంలో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే మిగతా అర్హులకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని.. చేనేతల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.