నేను కొడితే మామూలుగా ఉండదు.. ప్రభుత్వంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

1 year ago 32
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్‌ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం తన ఫామ్‌హౌస్‌లో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదని, ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కనబడితే జనాలు కొట్టేలా ఉన్నారని అన్నారు. ఏ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో పోల్ పెడితే.. బీఆర్ఎస్ సర్కారు కావాలని ఓట్లేశారన్నారు. నేను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం నా అలవాటని అన్నారు. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ పెడతామని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.
Read Entire Article