పుష్ప-2 సినిమా దేశమంతా సత్తా చాటుతుంటే.. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవటంతో హీరో అల్లు అర్జున్ మాత్రం ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. ఈ సినిమాలో పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ స్మగ్లర్‌గా కనిపిస్తాడు. అయితే.. అల్లు అర్జున్ కేవలం రీల్ పుష్ప అని.. తాను మాత్రం రియల్ పుష్ప అంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది.