ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పంచదారల కొండల్లో మైనింగ్‌ను అనుమతులు మంజూరు చేయడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలకు పాల్పడినట్టు గనుల శాఖ అధికారుల పరిశీలనలో వెల్లడయ్యింది. దీనిపై ఉన్నతాధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా కూటమి ప్రభుత్వం అక్కడ గనుల తవ్వకాలకు అనుమతిస్తూ ఇచ్చిన లీజును రద్దుచేసింది.