హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ ఏడాది మొత్తం లక్ష మట్టి వినాయక విగ్రహాలను.. నగరవ్యాప్తంగా ఉచితంగా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 3 పరిమాణాల్లో ఈ లక్ష విగ్రహాలను తయారు చేయనున్నారు. సహజ మట్టి, పర్యావరణానికి హాని చేయని పదార్థాలతోనే విగ్రహాలను తయారు చేయాలని నిబంధనలు విధించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులు, హానికర రసాయనాల వినియోగాన్ని అనుమతించరు. నిమజ్జనం కారణంగా నీటి వనరుల్లో కాలుష్యాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.