నూతన సంవత్సరం వేడుకలు తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. నిన్న రోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మందు బాబులు మంచినీళ్లలా లిక్కర్ తాగటంతో సర్కార్‌కు భారీగా ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.