New Year Celebration: న్యూఇయర్ సెలెబ్రేషన్స్ కోసం హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా.. యువత రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. అయితే.. ఈ న్యూఇయర్ సెలెబ్రేషన్స్ టార్గెట్‌గా చేసుకుని కొంత మంది నగరానికి భారీగా డ్రగ్స్ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే.. డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని విచారించగా.. బ్లాస్టింగ్ విషయం బయటపడింది. ఏకంగా కోటి రూపాయల సరుకు న్యూఇయర్ సెలెబ్రేషన్స్ కోసం తెప్పించినట్టు బయటపడింది.