హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యోతో సమానంగా నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు నిర్మించిన మరో అతిపెద్ద ఫ్లైఓవర్‌ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి.. రూ.5827 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను వర్చువల్‌గా పారంభించారు. ఇందులో భాగంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో HCITI ఫేజ్-1లో రూ.3446 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.