తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రాంత నివాసాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నిరుపేదల కోసం.. ఉన్నచోటే బహుళ అంతస్తుల ఆవాసాలు (G+3) కట్టాలని నిర్ణయించారు. నాలుగు ఐటీడీఏల పరిధిలోని గిరిజనులకు 13,266 ఇళ్లు, అలాగే 16 ఎస్టీ నియోజకవర్గాలకు 8,750 గృహాలు అనుమతించారు. మొత్తంగా 22,016 ఆవాసాలు కేటాయించారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా నివాసానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయదని గుర్తు చేస్తూ.. ఇది నిరంతర కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు.