వినాయకచవితి రోజున తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. కృష్ణా జిల్లాలో మామిడాకులు కోశాడనే కోపంతో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. అన్నమయ్య జిల్లాలో వినాయకుడి మండపం ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఓ బాలుడు చనిపోయాడు. అటు తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోనూ కరెంట్ షాక్‌తో ఓ యువకుడు చనిపోయాడు.