దీపావళి పర్వదినం రోజు ఓ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో మంటలు చెలరేగి సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. టీవీ, ఫ్రిజ్ కూలర్‌తో పాటుగా బీరువాలో దాచిన రూ.2.40 లక్షల క్యాష్ కూడా దగ్దమైంది. 15 గ్రాముల బంగారం కూడా మంటల్లో కాలిపోయినట్లు బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.