పండగల సీజన్‌లో రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు మధ్య మొత్తం 16 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 6 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. నల్గొండ, మిర్యాలగూడ, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం స్టేషన్ల మీదుగా సర్వీసులు సాగుతాయి. ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.