హైదరాబాద్‌కు తాగునీటిని అందించే మంజీరా ప్రాజెక్టు ఫేజ్-2 పరిధిలోని 1,500 ఎంఎం డయా పీఎస్‌సీ పంపింగ్ మెయిన్ పలు చోట్ల లీకేజీలకు గురైంది. వీటికి చెక్ పెట్టేందుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. దీంతో నేడు 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. వినియోగదారులు నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని HMWSSB కోరింది.