పండుగ వేళ.. మందుబాబులకు బ్యాడ్‌న్యూస్..

11 months ago 22
పండుగ ఏదైనా తెలంగాణలో మద్యం సేవించే అలవాటు చాలామందికి ఉంది. కానీ.. ఈసారి దసరా పండుగ రోజే మద్యం లభించకపోవచ్చు. అక్టోబర్ 2వ తేదీన విజయదశమితో పాటు గాంధీ జయంతి కూడా వస్తుంది. గాంధీ జయంతి సందర్భంగా చట్టం ప్రకారం రాష్ట్రంలో మద్యం, మాంసం అమ్మకాలు నిషేధం. దీంతో పండుగ రోజునే మద్యం బంద్‌ అవుతుండడంపై అధికారులు ఎలా వ్యవహరించాలనే విషయంపై ఆలోచనలో పడ్డారు. ఇది పండుగ ఉత్సాహాన్ని ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడాల్సి ఉంది.
Read Entire Article