పందెం వేసుకుని మోతాదుకు మించి ఆ మాత్రలు మింగిన హాస్టల్ విద్యార్థులు.. చివరకు ఏమైందంటే?

2 months ago 3
పందెం పేరుతో ఇద్దరు విద్యార్థులు చేసిన పని.. వారిని ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా ఈపూరు ప్రభుత్వ హాస్టల్‌లో చదివే ఇద్దరు విద్యార్థులు పందెం వేసుకున్నారు. ఎవరు ఎక్కువ ఐరన్ మాత్రలు మింగుతారనేది పందెం. అయితే ఈ పందెంలో భాగంగా ఓ విద్యార్థి పది మాత్రలు మింగగా, మరొక విద్యార్థి ఏకంగా 20 మాత్రలు మింగాడు. మోతాదు ఎక్కువ కావటంతో అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ వార్డెన్ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది.
Read Entire Article