పట్టపగలు, ఆర్టీసీ బస్సులో ఛీఛీ ఇదేం పని.. మత్తుమందు ఇచ్చి మరీ.!

7 months ago 11
దొంగలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నారు. ఏకంగా ఆర్టీసీ బస్సులోనే మత్తుమందు ఇచ్చి బంగారు నగలు చోరీచేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. అద్దంకి - ఒంగోలు బస్సులో ప్రయాణిస్తున్న హనుమంతరావు అనే వ్యక్తికి వాటర్ బాటిల్‌లో మత్తుమందు కలిపి ఇచ్చిన ఆగంతకుడు.. హనుమంతరావు నిద్రలోకి జారుకున్న తర్వాత అతని వద్దనున్న బంగారు నగలు, మొబైల్ ఫోన్ తీసుకుని ఉడాయించాడు. ఈ ఘటనపై హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. బస్సులో దొంగతనం విషయం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article