సగటు జీవి పట్నంలో బతుకు బండిని లాగటం కష్టమే. ప్రతి ఏడాది ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఓ 15 వేలు సంపాదించే సగటు జీవి అందులో సగానికి పైగా నెలవారీ ఖర్చుల కోసమే వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఖర్చులు పెరిగిపోతున్నాయి. తాజాగా.. కుటుంబ వినియోగ వ్యయం 2023-24 సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణ వ్యయంలో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్లో ఉంది.