రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ముప్పిరితోటలో ఓ యువకుడిని అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో అమ్మాయి తండ్రే కిరాతకంగా హతమార్చాడు. పుట్టిన రోజు వేడుకల్లో ఉండగా.. అకస్మాత్తాగు గొడ్డలితో దాడి చేసి చేశాడు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.