ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ క్రమశిక్షణావళిని ఉల్లంఘించారనే ఫిర్యాదులు రావటంతో దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన వ్యవహారం, దువ్వాడ వాణితో కుటుంబ విభేదాలు, దివ్వెల మాధురితో తదుపరి అడుగులపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఏదైమైనా దివ్వెల మాధురితో కలిసే ఉంటానని స్పష్టం చేశారు.