వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనపై నమోదైన కేసులో విచారణకు రావాలని ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వగా.. కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి నోటీసులు అందించిన పోలీసులు.. గాలింపు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ కాకాణి కోసం నెల్లూరు పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు.