మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పరిటాల రవి హత్య కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పరిటాల రవి హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఈ కేసులోని ఐదుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. పరిటాల హత్య కేసులోని నారాయణరెడ్డి, రేఖమయ్య, రంగనాయకులు, వడ్డే కొండ, ఓబిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2005 జనవరిలో పరిటాల రవి హత్య జరిగింది.