ఉమ్మడి అనంతపురం రాజకీయాల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి సన్మానించారు. రాప్తాడులో జరిగిన వ్యవసాయ సదస్సు ఇందుకు వేదికైంది. రాప్తాడులో శనివారం అగ్రికల్చర్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సదస్సుకు చేసిన ఏర్పాట్లను సైతం జేసీ ప్రభాకర్ రెడ్డి మెచ్చుకున్నారు.