పరిమళించిన మానవత్వం.. పసివాడి ప్రాణం కోసం ఏకమైన ఊరు.. రూ.22 లక్షల సేకరణ..

3 months ago 23
తమలో ఒకడికి కష్టం వచ్చిందని.. ఆ ఊరంతా అండగా నిలిచింది. తమవలన ఏమవుతుందిలే అని ఊరుకోలేదు. రాముడికి ఉడత సాయంగా తమకు తోచిన సాయం అందిద్దామని భావించింది. ఒక్కో రాయి పేర్చుతూ వానర సైన్యం లంకకు వారధి కట్టినట్లు.. చేయి చేయి కలిపి రూ.22.5 లక్షలు సేకరించింది. తలసేమియాతో బాధపడుతున్న మణికంఠ అనే పసివాడి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం వాసుల ఐక్యత.. కష్టకాలంలో తమ ఊరివాడికి అండగా నిలిచిన వైనం ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.
Read Entire Article