నాంపల్లి బచాస్ ఫర్నిచర్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం కారణంగా నాంపల్లి - అబిడ్స్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీపీ సజ్జనార్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులు ఈ రోజు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలగకుండా వాహనాలను ఇతర మార్గాల్లో దారి మళ్లిస్తున్నాట్లు తెలిపారు.