హైదరాబాద్‌లో గల 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అండేద్కర్ విగ్రహ సందర్శనను అధికారులు నిలిపివేశారు. బీ ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 14న సందర్శనకు అనుమతించారు. సందర్శనను అధికారులు సోమవారం నుంచి నిలిపివేశారు. మ్యూజియంలో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు మరమ్మతులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. పనులు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. దీనిని నగరవాసులు గమనించాలని సూచించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.