తెలంగాణలో సింగపూర్ తరహా ఎకో టూరిజాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అందుకు కొత్త టూరిజం పాలసీని రూపొందించాలన్నారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించేలా కొత్త పాలసీని రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలన్నారు.