పల్నాడు జిల్లాలో కలకలంరేపిన అన్నదమ్ముల హత్యకేసు మిస్టరీ వీడింది. నెకరికల్లులో కలకలంరేపిన జంట హత్యల కేసు సినిమా స్టోరీని తలపిస్తోంది. ఉపాధ్యాయుడైన తండ్రి చనిపోయిన తర్వాత.. ప్రభుత్వం నుంచి ఆయనకు వచ్చే డబ్బు కోసం జరిగిన గొడవ.. సొంత అన్నదమ్ములనే సోదరి హత్య చేయడానికి దారితీసింది. సోదరిని చంపడానికి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ప్లాన్ చేస్తే.. ఆ ప్లాన్ తెలుసుకుని ఆ అన్నదమ్ములు ఇద్దరనీ పక్కా ప్రణాళికతో సోదరి హత్య చేసింది. సోదరి చేతుల్లో హత్యకు గురైన అన్నదమ్ముల్లో ఒకరు పోలీస్ కానిస్టేబుల్ కావడం గమనార్హం. ఈ హత్యలకు సోదరి కృష్ణవేణి తెలివిగా నలుగురు మైనర్లను వాడుకుంది. భర్తను వదిలి పుట్టింట్లోనే ఉంటున్న కృష్ణవేణి.. ఈ హత్యలకు తన ప్రియుడి సాయం కూడా తీసుకుంది. మొత్తానికి ఈ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ క్రైమ్ స్టోరీని పోలీసులు వివరించారు.