ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. కాకినాడ పోర్టులో కలెక్టర్ అప్పటికే సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని.. పవన్ కళ్యాణ్ సాహసోపేతంగా చూడటానికి వెళ్లారంటూ సెటైర్లు వేశారు. రెండు నెలల కిందటే తాను కాకినాడ పోర్టులోకి వస్తుంటే.. రావద్దని అడ్డం పడ్డారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అంబటి ఎద్దేవా చేశారు. ఎస్పీ, పౌరసరఫరాల శాఖ అధికారులు, పోర్టు అధికారులు తనకు సహకరించలేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అంబటి రాంబాబు తప్పుబట్టారు. అసలు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉండి పనిచేస్తున్నారా.. లేదా ప్రభుత్వంలో లేకుండా పనిచేస్తున్నారా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.