ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు. శుక్రవారం ఉదయం పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వ్యక్తిగత వైద్యుల సూచనతో ఆస్పత్రికి వెళ్లిన పవన్ కళ్యాణ్ పలు పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షలు పరిశీలించిన వైద్యులు సర్జరీ చేయాలని సూచించటంతో శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌కు సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకోవటానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.