Pawan Kalyan Vijayawada Fan Walk To Kolkata: విజయవాడ వాంబే కాలనీకి చెందిన యువకుడికి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. జనసేనాని ఏపీ ఎన్నికల్లో గెలిస్తే విజయవాడ నుంచి కోల్‌కతాకు కాలి నడకన వెళ్లి కాళీమాతను దర్శించుకుంటానని మొక్కుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడు వెయ్యి కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. మరో 300 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసి కాళీమాతను దర్శించుకోనున్నారు. అయితే ఈ యువకుడు తన మనసులో మాటను కూడా చెప్పాడు.