హిందూపురం నుంచి వచ్చిన యువరైతు నవీన్‌కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. 28 రోజులు 760 కిలోమీటర్లు ఎడ్లబండిపై ప్రయాణించి గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రైతు ఉన్న చోట పవన్ కళ్యాణ్ తన కారు ఆపి మాట్లాడారు. పంట ఉత్పత్తులను సరైన ధరకు అమ్మలేకపోతున్నామని, దళారుల బెడద ఎక్కువైందని నవీన్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పర్యటన ఉందని.. తాను వెళ్లాలని.. అందుకే ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నానని చెప్పారు పవన్. వెసమస్యలపై తన కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వాలని సూచించి.. పూర్తి వివరాలు తీసుకోవాలని అక్కడున్న అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ సూచనలతో వినతి పత్రం సమర్పించి తాను తిరిగి తన సొంత ఊరికి వెళ్లిపోతానని చెప్పారు యువ రైతు నవీన్‌కుమార్.