ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను దూషించారంటూ జనసేన కార్యకర్తలు దువ్వాడ శ్రీనివాస్‌పై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు రావాల్సిందిగా పోలీసులు దువ్వాడ శ్రీనివాస్‌కు ఇటీవల 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే దివ్వెల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. సుమారు 23 నిమిషాలపాటు దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలి పోలీసులు విచారించారు. అనంతరం తన ఫిర్యాదులపై పోలీసులు పట్టించుకోవడం లేదని దువ్వాడ శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు.