ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ నేతల స్వరం మారుతోందా.. మొన్నటి వరకూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేతలు సైతం ఇప్పుడు మాటతీరు మార్చుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. మొన్నటికి మొన్న పేర్ని నాని పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించారు. సముద్రంలోకి వెళ్లి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవటం అభినందనీయమని అన్నారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించారు. ఏపీకి నాయకత్వం వహించే సామర్థ్యం పవన్ కళ్యాణ్‌కు ఉందంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.