ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఫిర్యాదులు అందుతున్నాయి. జనసేన కార్యకర్తలు పలుచోట్ల పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ పలుచోట్ల జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి.