ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని నిర్మాత దిల్ రాజు. ఆయన్ని చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. తాను నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ సక్సెస్ కావడానికి ఆయనే కారణం అని అన్నారు. ఆ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాటలు విని తాను భావోద్వేగానికి గురయ్యానన్నారు. పవన్ కళ్యాణ్‌ను తాను ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా చూస్తుంటానన్నారు. తొలిప్రేమ నుంచి ఆయనతో తన ప్రయాణం మొదలైంది అన్నారు. దాదాపు 25 ఏళ్ల ప్రయాణమని.. కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారన్నారు. ఆయన అలా ఎందుకు చేస్తున్నారని చాలామంది మాట్లాడుకున్నారని.. అందులో తాను కూడా ఒకడిని అన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే ఆయనేమీ విజయాన్ని అందుకోలేదని.. పరాజయం వచ్చినా ఆయన ఎక్కడా ఆగలేదన్నారు. ఎంతో శ్రమించారిని.. ఇటీవల 21 సీట్లకు 21 గెలుచుకొని ఘన విజయాన్ని అందుకున్నారన్నారు. ఆయనే నిజమైన గేమ్ ఛేంజర్ అన్నారు. సక్సెస్ రాలేదని, ఎక్కడా ఆగకూడదని శ్రమిస్తే విజయం తప్పక వరిస్తుందని ఆయన్ని చూశాకే అర్థమైందన్నారు.