ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటే వైసీపీ వాళ్లు జర్మనీకి వెళ్లాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, రోజా.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే గోవాకు వెళ్లాలంటూ అంబటి కౌంటరివ్వగా.. రష్యా అల్లుడు అయిన పవన్‌కు జర్మనీ గురించి తెలిసే ఉంటుందంటూ మరో మాజీ మంత్రి రోజా సెల్వమణి సెటైర్లు వేశారు.