డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా జనసేన ఎమ్మెల్యే మరొకరు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. రంగరాయ మెడికల్ కాలేజీ డాక్టర్‌పై దౌర్జన్యం చేసి వార్తల్లోకి ఎక్కిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ.. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. తాను తప్పు చేశానని.. అందుకు పశ్చాత్తాపపడుతున్నానని నానాజీ తెలిపారు. తప్పునకు పరిహారంగా పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సోమవారం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం పది నుంచి సాయంత్రం వరకూ తన ఇంటి వద్ద దీక్షలో ఉంటానని తెలిపారు.