పవన్‌ ముందు జనసేన నేత కొత్త డిమాండ్.. డిప్యూటీ సీఎం ఎలా స్పందిస్తారో?

1 month ago 6
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా శ్రీహరిని దర్శించుకుంటున్నారు. ఈ రోజునే వైకుంఠ ధ్వారాలు తెరుచుకుంటాయని.. 33 కోట్ల మంది దేవతలు శ్రీమన్నారాయణుని దర్శించుకోడానికి వస్తారని నమ్మకం. అందుకే ఆ రోజున వైష్ణవ ఆలయాలకు భక్తులకు తరలివస్తారు. ఇక, కలియుగ వైకుంఠం తిరుమలలోనూ ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. అయితే, ఈ దర్శనంలో స్థానికులకు అవకాశం కల్పించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. రానురానూ శ్రీవారి దర్శనాల్లో స్థానికులకు ప్రాధాన్యత తగ్గిపోతోందని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానికులకు దర్శన అవకాశం కల్పించలేదన్నారు. ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. స్థానికులకు దర్శనాల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. చెప్పినట్టే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనంలోనూ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.
Read Entire Article