మనిషి మారేందుకు కనీసం 21 రోజుల సమయం కావాలంటుంటారు నిపుణులు. అదే లాజిక్‌తో మనిషిలోని దుర్గుణాలన్ని తొలిగించుకుని.. మనసులోని దైవత్వాన్ని మేల్కొని, సద్గుణాలను ఆవిష్కరించుకునేందుకు మాలాధారణ అనే పవిత్ర క్రతువును హిందువులు ఆచరిస్తుంటారు. కానీ.. ఇంత పవిత్రమైన మాలను ధరించి కూడా మనిషి తనలో ఉన్న దుర్గుణాలను ఆచరిస్తూ.. ఆ పవిత్ర క్రతువుకు కలంకం తీసుకొస్తున్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగి చేసిన పని ఇప్పుడు అందరి ఆగ్రహానికి కారణమవుతోంది.