మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం ఉప్పెరగూడెంలో ఇద్దరు నకిలీ బాబాలు.. పట్టపగలే ఓ మహిళను నమ్మించి మోసం చేశారు. జాతకం చెప్తామంటూ మాయమాటలు చెప్పి ఇంట్లో మహిళ ఒంటరిగా ఉందని తెలుసుకుని.. తమ అసలు స్వరూపాలు భయపెట్టారు. బొట్టు పెట్టి విభూది చల్లి.. అపస్మారక స్థితిలోకి జారుకోగానే.. మహిళ ఒంటిపై ఉన్న బంగారంతో పాటు ఇంట్లో ఉన్న నగదు కూడా దోచుకుని పరారయ్యారు. మెలుకువలోకి వచ్చిన తర్వాత చూస్తే.. అప్పడు అసలు విషయం తెలిసింది.