ఉండి ఆర్వోబీ నిర్మాణ పనులలో వేగం పెరిగింది. ఈ మార్గంలోని గేటుకు రెండు వైపులా అదనపు గడ్డర్ల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఈ పనులు ప్రారంభం కాగా.. పనులలో భాగంగా ఇక్కడ ఉన్న ఎలక్ట్రికల్ లైన్ క్లియరెన్స్ ఎత్తును 40 సెంటీమీటర్ల వరకూ తగ్గించారు. ఈ నేపథ్యంలో మార్గంలో 13 అడుగులలోపు ఎత్తున్న వాహనాలకే అనుమతి ఉందని.. అంతకంటే ఎత్తైన వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.