పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొంతమంది రైతులు చేసిన పని ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది. భీమవరం - ఉండి నియోజకవర్గాలను కలుపుతూ లింక్ రోడ్డు విస్తరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం 1.5 కోట్లు మంజూరు చేసింది. అయితే స్థానిక రైతులు కూడా 3.5 కోట్లు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్‌తో కలిసి రతన్ టాటా మార్గ్ విస్తరణకు రఘురామకృష్ణరాజు శంకుస్థాపన చేశారు.