crowdfunding raised for treatment: హైదరాబాద్‌లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు దాతలు ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న పాప కోసం దాదాపు 8 వేల మంది విరాళాలు అందించి రూ.14 కోట్లు సేకరించారు. ఓ సంస్థ ఏకంగా కోటి రూపాయల విరాళం అందించింది. వైద్యులు చిన్నారికి విజయవంతంగా చికిత్స అందించడంతో ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉంది. దాతల సహాయానికి పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.