పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ నివాళులు అర్పించారు. ‘‘పహల్గామ్‌లో జరిగిన ఈ దారుణమైన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.. ఈ కష్ట సమయంలో వారి దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను’’ అని స్మితా సబర్వాల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది.