ఏపీ పాఠశాలల్లో ఒకే రోజు రెండు విషాద ఘటనలు జరిగాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ పదో తరగతి విద్యార్థిని తరగతి గదిలోనే ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అటు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో క్రేన్ కూలి.. నిర్మాణ సామాగ్రి మీద పడటంతో ఓ ఉపాధ్యాయురాలు చనిపోయింది. ఈ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. టీచర్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.