పాఠశాలల్లోకి స్వచ్ఛ రథాలు.. పనికిరాని వస్తువులకు ఉచితంగా పెన్నులు, పుస్తకాలు..

2 weeks ago 4
గ్రామాల్లో పరిశుభ్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా పనికిరాని వస్తువులను సేకరిస్తూ.. వాటికి బదులుగా నగదు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు మరో నిర్ణయం తీసుకున్నారు. ఈ స్వచ్ఛ రథాలను ఇళ్ల వద్దకే కాకుండా పాఠశాలల వద్దకు కూడా పంపిస్తున్నారు. విద్యార్థుల నుంచి పనికిరాని వస్తువులను సేకరించి.. అందుకు బదులుగా వారికి అవసరమైన అట్టలు, పుస్తకాలు, పెన్నులు అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేస్తున్నారు.
Read Entire Article